బాన్సువాడ/ బీర్కూర్/ నస్రుల్లాబాద్, డిసెంబర్ 20 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ కార్యక్రమంతోపాటు బీర్కూర్ మండలంలోని కామప్ప చౌరస్తా, నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ.. నల్ల చట్టాలతో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం, తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ఆత్మకమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, బాన్సువాడ, బుడ్మి సొసైటీ అధ్యక్షులు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్ పాల్గొన్నారు. బీర్కూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అవారి గంగారాం, ఎంపీపీ రఘు, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లాడేగాం వీరేశం, యూత్ విభాగం మండలాధ్యక్షుడు శశికాంత్, పట్టణ అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్‌లో ఎంపీపీ పాల్త్య విఠల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, విండో చైర్మన్లు గంగారాం, దివిటి శ్రీనివాస్, సుధీర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.