కల్వకుర్తి/కల్వకుర్తిరూరల్, ఆగస్టు 15: అట్టడుగు వర్గాలవారికి స్వాతంత్య్ర ఫలాలు చేరేలా ముందుకు సాగుదామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు. కల్వకుర్తి మున్సిపాలిటీ, మార్కెట్‌యార్డు, కమ్యూనిటీ దవాఖాన, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఎమ్మెల్యే హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, మార్కెట్‌యార్డులో చైర్మన్ బాలయ్య, ప్రభుత్వ దవాఖాన, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ గిరిబాబు, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాజేశ్, రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్, వాసవీక్లబ్లో రమేశ్‌బాబు, లయన్స్‌క్లబ్‌లో క్లబ్ అధ్యక్షుడు, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, ఆర్టీసీ డిపోలో మేనేజర్ వాసురాంనాయక్ జెండా ఎగురవేశారు. అదేవిధంగా పట్టణంలోని బ్రిలియెంట్ విద్యాసంస్థల వద్ద ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి జెండా ఎగురవేసి గౌరవవందనం చేశారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీలు, పాఠశాలలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగను నిర్వహించుకున్నారు.
తాడూరు, ఆగస్టు 15: మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ శ్రీదేవి, మండల మహిళా సమాఖ్య వద్ద అధ్యక్షురాలు బాలమణి, ఎంఈవో కార్యాలయం వద్ద ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డి, సింగిల్ విండో వద్ద అధ్యక్షుడు సమద్‌పాషా, వ్యవసాయ కార్యాలయం ఎదుట వ్యవసాయ అధికారి ప్రకాశ్‌గౌడ్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై వీరబాబు, పీహెచ్సీలో డాక్టర్ సుబ్బారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.
తాడూరు సింగిల్‌విండో కార్యాలయం వద్ద స్థానిక చిన్నారులు జడకొప్పుల కోలాటం వేశారు. చిన్నారుల కోలాటానికి ఆకర్షితులైన సింగిల్‌విండో సిబ్బంది జడకొప్పు కోలాటం నేర్పించిన మాస్టర్ శేఖర్‌కు రూ.5వేల ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో విండో చైర్మన్ సమద్‌పాషా, ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ యార రమేశ్, సీఈవో ఆంజనేయులు, మాజీ విండో ఉపాధ్యక్షుడు మహేందర్, బాలవెంకటయ్య, అర్జున్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.