
కోస్గి, జనవరి 9: నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో కోస్గి మండలస్థాయి వాలీబాల్ పోటీలు గుండుమాల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ మధుకర్‌రావు, సీఐ జనార్దన్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో మెలగాలన్నారు. క్రీడలు మనిషికి శారీరక దారుఢ్యాన్ని , మానసిక ఉల్లాసాన్ని కలిగిస్త్తాయన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని ఓటమి పాలైనవారు కుంగిపోవడం సరికాదన్నారు. ఓడినవారు గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకుంటే ముందుకెళ్తారన్నారు. అనంతరం విజేతలకు బహుమతిప్రదానం చేశారు.
నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు
నారాయణపేట, జనవరి 9: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని అప్పక్‌పల్లి గ్రామంలో ఈ నెల 13,14 తేదీల్లో జిల్లాస్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మోహన్, మొగులప్ప, శ్రీనివాస్‌లు ఆదివారం ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునేవారు ఈనెల 12వ తేదీ వరకు జట్ల పేర్లు, వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. విజేతలకు మొద టి బహుమతిగా రూ.5వేలు, ద్వితీయ బహుమతిగా రూ.3వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అప్పక్‌పల్లి గ్రామ స్థాయిలో మహిళలకు ముగ్గుల పోటీలు, రన్నింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, జట్లను నమోదు చేసుకునేందుకు 6303409038, 970188 5213, 7989996292 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
నేడు కబడ్డీ క్రీడాకారుల ఎంపిక
నారాయణపేట, జనవరి 9: పట్టణంలోని మినీ స్టేడియంలో సోమవారం కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ మండల అధ్యక్షుడు నర్సింహులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 11, 12 తేదీల్లో మరికల్లో జరిగే జిల్లాస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 8గంటల వరకు మినీ స్టేడియంకు చేరుకోవాలన్నారు. మిగతా వివరాలకు 8639708211, 9849 635419 నెంబర్లను సంప్రదించాలని కోరారు.