
ఖమ్మం, డిసెంబర్ 30: రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసినందకు మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గెలుపొందిన మధుసూదన్‌ను, విజయం కోసం కృషి చేసిన శ్రేణులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సీడీఎంఏ కార్యాలయంలో నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి తాతా మధుసూదన్ పాల్గొన్నారు.