ఎల్బీనగర్: వరదల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించి, రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పిరిట్ ఆఫ్ హ్యూమానిటీ అవార్డును అందుకున్నారు.
మంగళవారం తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ చేతుల మీదుగా ఈ అవార్డును సుధీర్‌రెడ్డి అందుకున్నారు. విశ్వగురు అంతర్జాతీయ రికార్డు సంస్థ వారి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుధీర్‌రెడ్డి వరదల సమయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు అందించిన సహాకారం, పేద ప్రజలకు అనాథలకు, అంధులు, వికలాంగులకు అందించిన అపారమైన సేవలను గుర్తించి స్పిరిట్ ఆఫ్ హ్యూమానిటీ అవార్డును అందించారు.
ఈ కార్యక్రమంలో విశ్వగురు అంతర్జాతీయ రికార్డ్ సంస్థ వ్యవస్థాపకులు, సీఇఓ సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, సోషల్ మీడియా ఇన్చార్జీ రమాకాంత్, ఎంఆర్డీసీఎల్ ఛైర్మన్ ఓఎస్డీ పగడాల శివప్రసాద్, కృష్ణ సాగర్ తదితరులు పాల్గొన్నారు.