బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు బస్తీలు, కాలనీల్లోని చర్చిలకు సంబంధించిన పాస్టర్లతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బుధవారం సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని మతాలకు సంబంధించిన పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఇదే తీరులో ఈ ఏడాది క్రిస్మస్ పండుగను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
డిసెంబర్ 11న యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో క్రిస్మస్ ఈవ్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పాస్టర్లతో చర్చించామని పేర్కొన్నారు.