బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని గాయత్రీహిల్స్లో స్థానిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసు కున్న సీసీ కెమెరాలను గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎలాంటి నేరాలు జరిగినా తక్షణమే గుర్తించవచ్చని, కాలనీవాసులు తమ భద్రత కోసం కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.