Black Fungus | బ్లాక్ ఫంగస్‌తో పాడైన దవడలను పునర్నిర్మించిన మెడికవర్ వైద్యులు

కొండాపూర్ : కొవిడ్ బారీనపడి చికిత్స పొందుతున్న సమయంలో మ్యూకార్ముకోసిస్ (బ్లాక్ ఫంగస్) సోకడంతో పాడైపోయిన దవడను హైటెక్‌సిటీలోని మెడికవర్ దవాఖాన వైద్యులు పునర్మించారు.
బ్లాక్ ఫంగస్‌తో పై దవడలు (చెంప ఎముకలు, అంగిలి, కంటి ఆధారం, మృదు కణజాలాలు) పాడైన ఇద్దరు రోగులు దవఖానలోని డెంటల్ విభాగం వైద్యులను సంప్రదించగా, వారికి మెరుగైన శస్త్ర చికిత్సల ద్వారా యధావిధిగా దవడలను అమర్చినట్టు బుధవారం దవాఖాన వైద్యులు డాక్టర్ శరత్ బాబు వెల్లడించారు.
విజయవాడకు చెందిన సత్యం (40), రాము(40)లు కొవిడ్ భారీన పడి కోలుకున్నారు. కొద్ది రోజులకే ఇద్దరికి మ్యూకార్ముకోసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధి బారినపడ్డారు. దీంతో ఇద్దరికి ఎగువ దవడ, దంతాలను తీసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దవడ తొలగించకపోతే ప్రాణానికి ప్రమాదమున్నదన్న విషయాన్ని వారికి తెలియజేయడంతో తొలగింపుకు అంగీకరించారు.
దవడలు తొలగించిన మూడు నెలల తర్వాత మూడు దశల్లో 3డీ సీటీ ఫేషియల్ ఎముకల పునర్మిర్మాణం, 3డీ మిల్లింగ్ టైటానియం ఇంప్లాంట్ ప్లేట్లను రూపొందించి కోల్పోయిన దవడతో పాటు దంతాలను అమర్చడం జరిగింది. దవడల అమరిక పూర్తైన అతి తక్కువ సమయంలోనే రోగులు తమ ఆహారాన్ని నోటి ద్వారా తీసుకోవడంతో పాటు ముందులా మాట్లాడగల్గుతున్నట్లు వైద్యులు శరత్ బాబు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

