
మెదక్ రూరల్, డిసెంబర్ 22 : నిత్య జీవితంలో గణితం ఒక భాగమైందని హెచ్ఎం మాధవీరామాంజనేయులు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని గీత ఉన్నత పాఠశాల, మంబోజిపల్లిలో గణితశాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణితంపై వివిధ కోణాల్లో గోడ పత్రికలతో చార్ట్ ప్రదర్శించారు. అనంతరం హెచ్ఎం మాట్లాడుతూ రామానుజన్ సంఖ్య 1729 విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్లొన్నారు.
ఘనంగా రామానుజన్ జయంతి..
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 22 : శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని సిద్దార్థ్ పాఠశాల, కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ చౌదరి, సిద్దార్థ్ పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.