
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
భువనగిరి అర్బన్, డిసెంబర్ 16 : టీఆర్ఎస్తోనే నియోజకవర్గంలోని గ్రామాలకు మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా మండలంలోని బస్వాపురం గ్రామంలో రూ.40లక్షలు, ముత్తిరెడ్డిగూడెంలో రూ.20లక్షలు, గంగసానిపల్లిలో రూ.10లక్షలు, జామ్మపురంలో రూ.5లక్షలు, బాలంపల్లిలో రూ.10లక్షల హెచ్ఎండీఏ నిధులతో చేపట్టిన అండర్‌గ్రౌండ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల్లో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి వసతితో పాటు ప్రజలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. నియోజకవర్గంలో 60ఏళ్ల నుంచి లేని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. అంతేగాక ప్రజా సంక్షేమానికి పింఛన్లు పెంచడం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా వంటి కొత్త పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అనంతరం గ్రామాల్లో తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్వాపురం రిజర్వాయర్ నుంచి వివిధ ప్రాంతాలకు నీరు వెళ్లేందుకు తీసిన కాల్వలపై బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని కోరుతూ ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సీపీఎం నాయకులు కొండమడుగు నర్సింహ, దయ్యాల నర్సింహ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, అబ్బగాని వెంకట్‌గౌడ్, బోయిని పాండు, ఉడుత ఆంజనేయులు, కృష్ణ, జడల యశీల్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సంక్షేమ కార్యక్రమాల్లో అగ్రగామి కల్యాణలక్ష్మి
భువనగిరి అర్బన్: సంక్షేమ పథకాలకు పెట్టింది పేరుగా తెలంగాణ ప్రభుత్వం నిలిస్తే అందులో కల్యాణలక్ష్మి పథకం అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పోచంపల్లి పట్టణంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 61మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు.