
జడ్చర్ల, డిసెంబర్ 20 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం జడ్చర్లలోని అంబేద్కర్‌చౌక్ నుంచి పాతబజార్ గాంధీచౌక్ వరకు ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహ నం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. రైతులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్నారని బీజేపీ చిక్కులు పెడుతున్నదని తెలిపా రు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతుంటే.. రాష్ట్రంలోని బీజేపీ అధ్యక్షుడు బండి సం జయ్ మాత్రం వరిని నాటుకోవాలని రైతులకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వడ్లను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ధాన్యాన్ని వం దశాతం కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమం లో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, జె డ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్స న్ దోరేపల్లి లక్ష్మి, మాజీ వైస్‌ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, మండల అధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్లు మల్లేశ్, సుధాకర్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.