
మధిర రూరల్, డిసెంబర్ 20: రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని, తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో మొండి వైఖరి విడనాడాలని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు సూచించారు. లేకుంటే రాబోయే రోజుల్లో అన్నదాతలే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ‘ఊరూరా చావుడప్పు’ నిరసనలో భాగంగా మధిర పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, రైతులతో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంపైనా, ఇక్కడి రైతులపైనా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీపీ మెండెం లలిత, టీఆర్ఎస్ నాయకులు మొండితోక జయాకర్, టీఆర్ఎస్ నాయకులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వర్లు, అరిగె శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, కపిలవాయి జగన్మోహన్రావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, ముత్తవరపు ప్యారీ, యన్నంశెట్టి అప్పారావు, బిక్కి కృష్ణప్రసాద్, కటికల సీతారామిరెడ్డి, బొగ్గుల భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.