
మన్సూరాబాద్/ఎల్బీనగర్/హయత్‌నగర్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ వేర్వేరుగా హాజరై శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే టీఆర్ఎస్ హయత్‌నగర్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి శ్రీకాంతాచారి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం అమరులైన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని చేయూతనిచ్చిందని తెలిపారు.
కార్యక్రమంలో శ్రీకాంతాచారి స్మారక కమిటీ గౌరవ అధ్యక్షుడు పోలోజు వెంకటాచారి, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, జక్కిడి రఘువీర్‌రెడ్డి, భాస్కర్‌సాగర్, సింగిరెడ్డి మల్లీశ్వరీరెడ్డి, గుడాల మల్లేశ్‌ముదిరాజ్, ఎస్టీ సెల్ డివిజన్ అధ్యక్షుడు దేవరాం నాయక్, బీసీ సెల్ అధ్యక్షుడు బాలకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు చెన్నగోని రవీందర్ గౌడ్, భాస్కర్ గుప్తా, గోవర్ధన్, లాల్కోట వెంకటాచారి, శిరీష, తదితరులు పాల్గొన్నారు.