మల్లాపూర్, ఏప్రిల్ 15: మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇండ్లను టార్కెట్ చేసుకొని వరుసగా 6 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. మూడున్నర తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.30 వేల నగదు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాతారం గ్రా మానికి చెందిన కుంభం లింగన్న, జంగ నర్స య్య, ఆర్మూర్ చిన్నపోశయ్య, శివరాత్రి సుగుణ, జిన్న లస్మయ్య, మోత్కురి రవికి చెందిన ఇళ్లలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. వీరిలో కొందరు ఊరేళ్లగా, మరికొందరు వేసవికాలం అ యినందున డాబామీద నిద్రిస్తున్నారు. ఇది గమనించిన దొంగలు గురువారం అర్దరాత్రి సమయంలో ఇనుప రాడ్లతో తాళాలను పగలగొట్టి ఇం డ్లలోకి చొరబడి బీరువాలు తెరిచి ఉన్న మూడున్నర తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.30 వేల నగదును అపహరించుకెళ్లారు. ఉదయం లేచి చూసే సరికి తెరిచిన తలుపులు, చిందరవందరగా ఉన్న సామగ్రిని చూసిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు క్లూస్ టీం బృందం సభ్యులతో ఆ ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనా స్థలాలను మెట్పల్లి సీఐ శ్రీను, ఎస్ఐ నవీన్‌కుమార్ పరిశీలించి, బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఒక్కరోజే గ్రామంలో వరుసగా ఆరు ఇండ్లలో దొంగతనం జరుగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్నారు.