ఉస్మానియా యూనివర్సిటీ :ప్రజల వద్దకు న్యాయాన్ని తీసుకెళ్లేందుకు త్వరలోనే జస్టిస్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగం డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ చెప్పారు. ఇటీవల ఆయన డీన్‌గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జిలు రాధాకృష్ణ హాన్, మహేశ్‌నాథ్, జూనియర్ సివిల్ జడ్జిలు సంపత్దేవి, మానస, లా విద్యార్థిని సమతలు సోమవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ కళాశాల విద్యార్థులు హైదరాబాద్ లీగల్ సర్వీస్ అథారిటీతో కలిసి సామాన్యులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తమ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ లక్ష్యమైన అందరికీ సమన్యాయం, సామాజికన్యాయం అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. ఆ దిశగానే న్యాయ కళాశాలలు, న్యాయ వ్యవస్థ పని చేయాలని అభిప్రాయపడ్డారు.