
జడ్చర్ల టౌన్, డిసెంబర్ 18 : హైదరాబాద్‌లోని గచ్చిబౌ లి వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జ డ్చర్లకు చెందిన ఎం.మానస(19) దుర్మరణం చెందింది. కూతురు మృతి చెందిన వార్త విన్న తండ్రి షాక్‌కు గురయ్యా డు. ఐదేండ్ల కిందట భార్యను కోల్పోయానని.. ఇప్పుడు కూతురు తనను విడిచి వెళ్లిపోయిందని కన్నీరుమున్నీరయ్యా డు. వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల పాతబజార్‌కు చెందిన రవి పండ్ల వ్యాపారం చేసేవాడు. ఆయన భార్య 2016లో మృతి చెందగా.. తన ఇద్దరు కూతుళ్లను అల్లారుముద్దుగా పెంచాడు. పెద్ద కూతురికి పెండ్లి చేయగా.. చిన్న కూతురు మానస ఇంటర్ వరకు చదువుకున్నది. సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో రెండేండ్ల కిందట హైదరాబాద్‌కు వెళ్లింది. అమీర్‌పేటలోని ఓ హాస్టల్లో ఉంటూ షార్ట్ ఫిలిం, చిన్న చిన్న షూటింగుల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. వారం రోజుల కిందట ఇంటికి వచ్చిన మానస కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడిపింది. షార్ట్ ఫిలిం షూటింగ్ ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వెళ్లింది. అంతలోనే ఆ మె మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని ఆమె తండ్రి విలపించాడు.