యాదాద్రి, జనవరి 6 : రైతుబంధు సంబురాలు పల్లె పల్లెనా ఆనందోత్సాహాల నడుమ సాగుతున్నాయి. మోటకొండూర్ మండలం చందేపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి కో కన్వీనర్లు రాణువ నర్సింహారావు, బంగారురెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు బురాన్, సర్పంచ్ దూదిపాల మున్ని, ఏఓ సుబ్బూరు సుజాత, ఏఈఓలు సంధ్య, ప్రణయ్, ఉపాధ్యాయులు రవీందర్, వీరమల్లేశ్, రామకృష్ణారెడ్డి, అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు.
రాజాపేట మండలంలో..
రాజాపేట : మండల కేంద్రంలో రైతుబంధు, కేసీఆర్ అక్షరమాల పేర్చగా, దూదివెంకటాపురంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రఘునాథపురం, బేగంపేట, దూదివెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్‌గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు పల్లె సంతోష్‌గౌడ్, కోశాధికారి కటకం స్వామి, ప్రధాన కార్యదర్శి రేగు సిద్ధులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట మండలంలో..
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని చిన్నకందుకూరు ఉన్నత పాఠశాలలో వ్యవసాయం, రైతుబంధుపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు ఏఈఓ శ్రావ్య తెలిపారు. పోటీలను ఏడీఏ పద్మావతి పరిశీలించారు. మాసాయిపేట రైతు వేదిక వద్ద మహిళలు ముగ్గులు వేశారు. కార్యక్రమంలో చిన్నకందుకూరు హెచ్ఎం జానకి, మాసాయిపేట సర్పంచ్ సువర్ణ, ఏఈఓ మనీషా పాల్గొన్నారు.
తుర్కపల్లి మండలంలో..
తుర్కపల్లి : మండలంలోని చిన్నలక్ష్మాపురంలో టీఆర్ఎస్ నాయకులు గిరిజన మహిళా రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పెట్టుబడి సాయాన్ని హర్షిస్తూ గిరిజన మహిళా రైతులు సంప్రదాయ నృత్యాలు చేశారు. గ్రామంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయగా, ఇబ్రహీంపురం, వాసాలమర్రి, మాదాపురం, తిరుమలాపురంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీలా రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, సర్పంచులు పోగుల ఆంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డి, నామసాని సత్యనారాయణ, మహేందర్, ఎంపీటీసీలు నవీన్‌కుమార్, కరుణాకర్, కో ఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్ పాల్గొన్నారు.
ఆలేరు మండలంలో..
ఆలేరురూరల్ : మండలంలోని గొలనుకొండ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. టంగుటూరులో ఎంపీటీసీ జూకంటి అనూరాధ ఆధ్వర్యంలో పొలాల్లో వరినారుతో రైతుబంధుగా పేర్చి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులు వంగాల శ్రీశైలం, కోటగిరి పాండరి, ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, కోటగిరి జయమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు జంగస్వామి, సుంచు మహేందర్, ఉప్పలయ్య, రైతులు పాల్గొన్నారు.
ఆత్మకూర్(ఎం)మండలంలో..
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంతోపాటు రాయిపల్లి, తిమ్మాపురంలో స్వీట్లు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద మహిళలు ముగ్గులు వేశారు. విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేశ్‌గౌడ్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, సర్పంచులు జెన్నాయికోడె నగేశ్, కొమిరెల్లి రాంరెడ్డి, పంజాల సుమతి, ఏఓ శిల్ప, ఏఈఓలు పాల్గొన్నారు.
చౌటుప్పల్ మండలంలో..
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని ధర్మోజిగూడెంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల సింహాచలం, వట్టి లింగస్వామి, శంకర్‌గౌడ్, సామిడి బాల్‌రెడ్డి, అంజిరెడ్డి, నర్సింహగౌడ్, మారేశ్గౌడ్ పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం మండలంలో..
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని సర్వేల్, వావిళ్లపల్లి, లచ్చమ్మగూడెంలో గ్రామ సభలు నిర్వహించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలపై రైతులకు వివరించారు. సర్వేల్ గురకులంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దోటి జంగయ్య, సర్పంచులు జక్కర్తి పాపయ్య, జెన్నాయికోడె అలివేలు, ఏఓ ఉమారాణి, ఏఈఓలు పాల్గొన్నారు.
అడ్డగూడూరు మండలంలో..
అడ్డగూడూరు : మండలంలోని చిన్నపడిశాల, కొండంపేట, లక్ష్మీదేవికాల్వ, రేపాక, గోవిందాపురం, ధర్మారంలో సంబురాలు నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు ఏఓ అరుణకుమారి తెలిపారు. సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
లింగరాజుపల్లిలో..
వలిగొండ : మండలంలోని లింగరాజుపల్లిలో రైతు బంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్‌రెడ్డి హాజరై రైతుబంధు, రైతుబీమా పథకాలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ బొడ్డుపల్లి ఉమాకృష్ణ, టీఆర్ఎస్ మండల కార్యదర్శి మామిండ్ల రత్నయ్య, డేగల పాండరి, గంగధారి రాములు, అయిటిపాముల సత్యనారాయణ, గంధమళ్ల గోపాల్, బొడిగె మైసయ్య, గంగధారి ఆశయ్య, బాలగోని నర్సింహ, గంధమళ్ల నర్సింహ, వెంకటేశం, మునుకుంట్ల నర్సింహ పాల్గొన్నారు.
గుండాల మండలంలో..
గుండాల : మండలంలోని సీతారాంపురం, తుర్కలశాపురం గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. గుండాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు పథకంపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఖలీల్, మండల కో ఆప్షన్ సభ్యుడు షర్పొద్దీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగూరి మల్లయ్య, నాయకులు ఇమ్మడి దశరథ, కోలుకొండ రాములు, గణేశ్, మలిపెద్ది మాధవరెడ్డి, మత్స్యగిరి, అనిల్, వెంకటేశ్, మల్లేశ్, మల్లారెడ్డి, కాశయ్య, గోవర్ధన్, సత్తిరెడ్డి పాల్గొన్నారు.
రామన్నపేట మండలంలో..
రామన్నపేట : మండలంలోని సిరిపురం, వెల్లంకి, సర్నేనిగూడెంలో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. గ్రామపంచాయతీ, రైతువేదికలను మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలతో అలంకరించారు. రైతుబంధు పథకం ముగ్గులు వేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతులను సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. సర్పంచులు అప్పం లక్ష్మీనర్సు, ధర్నె రాణి, బండ శ్రీనివాస్‌రెడ్డి, కూనూరు ముత్తయ్య, దాసిరెడ్డి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, శివగణేశ్, ఎడ్ల సురేందర్‌రెడ్డి, కర్రె రమేశ్, ఎడ్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
మోత్కూరు మండలంలో..
మోత్కూరు : మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సహకారంతో ప్రథమ బహుమతి రూ.3వేలు, ద్వితీయ రూ.2 వేలు, తృతీయ బహుమతి రూ.వెయ్యి ప్రకటించారు. గ్రంథాలయం చైర్మన్ మత్స్యగిరి, టీఆర్ఎస్ నాయకులు వెంకన్న, పరమేశ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.