నిజామాబాద్ క్రైం,జనవరి 9 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ ఫేస్-2లో ని వాసం ఉండే పప్పుల సురేశ్ భార్య, ఇద్దరు కు మారులతో కలిసి మూడు రోజుల క్రితం విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే పప్పుల సురేశ్, భార్య శ్రీలత వారి కుమారులు అఖిల్, ఆశిష్ ఆత్మహత్య చేసుకోడం వెనుక అప్పులు ఇచ్చిన వారి వేధింపులే కారణమనే ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకొనే ముందు తమ మరణానికి నలుగురు వ్యక్తులు కారణమని, వా రిని కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో రాసి ఉన్నట్లు తెలిసింది. మృతుల వద్ద లభించిన సూసైడ్ నోట్లో సురేశ్‌కు అప్పు ఇచ్చి వేధించిన వ్యక్తుల పేర్లు, సెల్‌ఫోన్ నంబర్లు సైతం రాసి ఉన్న నోట్ విజయవాడ పోలీసులకు దొరికినట్లు సమాచారం. సురేశ్ కుటుంబం ఆత్మహత్యకు ముందు రాసినట్లుగా చెప్పబడుతున్న నోట్లో నలుగురి పేర్లు ఉన్నట్లు తెలుస్తున్నది. వీరిలో నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యాపారితో పాటు ఓ బీజేపీ నేత పేర్లు ఉండగా, నిర్మల్‌కు చెందిన మరో ఇద్దరు వ్యాపారుల పేర్లు ఉన్నట్లు తెలుస్తున్నది. తమ చావుకు కారణం నలుగురు వ్యక్తుల ని, వారిని కఠినంగా శిక్షించాలని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ నోట్లో రాసి ఉం ది. దానిని విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా సూసైడ్‌కు ముందు ఆ కుటుంబం వడ్డీ వ్యాపారులతో సెల్ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఆడియో రికార్డింగ్, తాము ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తుల వివరాలతో కూడిన సెల్ఫీ వీడియో రికార్డింగ్ సైతం విజయవాడ పోలీసులకు లభించినట్లు సమాచారం. ఆ వాంగ్మూలం మృతులదేనా అందులో పేర్కొనబడిన ఆ నలుగురు వడ్డీ వ్యాపారులపై విజయవాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.
విజయవాడలోనే కేసు నమోదు
నగరంలోని గంగాస్థాన్‌కు చెందిన సురేశ్ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకోవడం, వారి వద్ద సూసైడ్ నోట్ లభించిన విషయం తమకు తెలిసిందని నిజామాబాద్ రూరల్ ఎస్సై తెలిపారు. సూసైడ్ నోట్ ఆధారంగా నలుగురు వ్యక్తులపై విజయవాడ పోలీసులు అక్కడే కేసు నమోదు చేస్తారు. అయితే విజయవాడ పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసేందుకు నిజామాబాద్‌కు వస్తే తమకు సమాచారం ఇస్తారని ఎస్సై తెలిపారు. అంతే కాకుండా వారిని అరెస్టు చేసేందుకు వస్తే పూర్తి సహకారం అందిస్తామని ఎస్సై తెలిపారు.
బంధువులకు మృతదేహాల అప్పగింత..
సురేశ్ కుటుంబీకుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. సురేశ్ భార్య తల్లిగారు మెట్పల్లి వాస్తవ్యులు కావడంతో ఆమె సోదరులకు విజయవాడ పోలీసులు ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించారు.