బేగంపేట్ : హుస్సేన్ సాగర్ నీటిలో ఓ గుర్తు తెలియని పసికందు మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు రోటరీ వద్ద హెచ్ఎండీ కార్మికులు సాగర్ నీటిలో నాలా క్లీనింగ్ పనులు చేస్తుండగా నీటిలో ఓ పసికందు మృతదేహాన్ని గుర్తించారు.
వెంటనే రాంగోపాల్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతి చెందిన పాప రెండు మూడు రోజుల వయస్సుంటుందని వైద్యులు తెలిపినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.