కొడంగల్, డిసెంబర్ 16: ప్రభుత్వం వరికి బదులుగా ఇతర పంటల సాగుపై రైతులకు కల్పిస్తున్న అవగాహన సత్ఫలితాలను ఇస్తున్నది. గతంలో అంతర పంటగా సాగు చేసుకునే పంటలను ప్రస్తుతం రైతులు ప్రధాన పంటగా సాగు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రతి ఏడాది ఒకే రకమైన పంటలను సాగుచేస్తే భూసారం తగ్గడంతోపాటు, పెట్టుబడి ఖర్చులు పెరిగి పంట దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రాదని గ్రామాల్లోని రైతులకు వ్యవసాయాధికారులు సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా యాసంగిలో దొడ్డు ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయబోదని స్పష్టం చేయడంతో రైతుల్లో చాలామంది తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు.
తగ్గుతున్న వరి సాగు..
నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో గతేడాది వరిసాగుతో కలిపి వేరుశనగ, జొన్న, కంది, వామ, బొబ్బెర్ల వంటి పంటలను మొత్తం 27 వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం యాసంగిలో కేం ద్ర ప్రభుత్వం దొడ్డు ధాన్యాన్ని కొనబోమని చెప్పడంతో రైతులు సందిగ్ధంలో పడిపోయి వరినారు ను కూడా సాగు చేయలేదని, దీంతో ఈ యాసంగిలో వేరుశనగ, ఆవాలు, కంది, వామ, బొబ్బెర్ల వంటి పంటల సాగు దాదాపు 12 వేల ఎకరాల్లో ఉండొచ్చని వ్యవసాయయాధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో యాసంగిలో వరి సాగు తగ్గి ఇతర పంటలను వేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.
అప్పట్లో అంతర పంట..
ఆవాలను రైతులు పంట మధ్యలో అంతర పం టగా గతంలో సాగు చేసుకునే వారు. ఇంటి అవసరాల మేరకు కంది, పెసర, జొన్న వంటి పంట ల మధ్య ఆవాలను సాగు చేసేవారు. ప్రభుత్వం
వరికి బదులుగా ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తుండటంతో చాలామంది రైతు లు ప్రధాన పంటగా ప్రస్తుతం సాగు చేస్తున్నారు.
టేకల్‌కోడ్ గ్రామంలో 50 ఎకరాల్లో..
ఆవాల పంటను ప్రస్తుత యాసంగిలో మండలంలోని టేకల్‌కోడ్ గ్రామంలో ప్రధాన పం టగా దాదాపు 50 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. గతేడాది గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు వన్నె బస్వరాజ్ తనకున్న 22 ఎకరాల్లో రెండు ఎకరాల్లో ఈ పంటను సాగు చేసి ఎకరాకు ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించినట్లు అతడు తెలిపా రు. ఆవాలను సాగు చేస్తే అడవి పందులు, పశువుల బెడద ఉండదని, పంటలో చీడ, పచ్చ పురుగు లాంటివి మాత్రమే వస్తాయని, వాటికి తక్కువ ధరలో లభించే పురుగుల మందులు పిచికారీ చేసుకుంటే సరిపోతుందన్నారు. ఈ యాసంగిలో తాను ఐదు ఎకరాల్లో పంటను సాగు చేసినట్లు తెలిపారు. ఐదు ఎకరాలకు కలిపి రూ.5-6 వేల వరకు ఖర్చు అయ్యింద న్నారు. మార్కెట్లో ఆవాలు క్వింటాల్‌కు రూ. 7నుంచి 8వేల వరకు ధర వస్తుందన్నారు. ఈ పంటను సాగు చేస్తే తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆదాయం పొందొచ్చన్నారు. గ్రామంలోని పలు వురు రైతులు తనను అనుసరించి దాదాపుగా 50 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.