
-రాజేంద్రనగర్ నుంచి హుజురాబాద్‌కు భారీగా తరలి వెళ్లిన టీఆర్ఎస్ శ్రేణులు
బండ్లగూడ:దళిత బందు పథకం దేశానికే ఆదర్శమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు.సోమవారం హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టనున్న దళితబంధు పథకం ప్రారంభోత్సంవానికి రాజేంద్రనగర్ నియోజక వర్గం నుంచి తరలి వెళ్లిన టీఆర్ఎస్ శ్రేణుల వాహనాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాదిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల నాడి తెలుసన్నారు.తెలంగాణలో అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తున్నారని తెలిపారు.దళితులు అంతా ముఖ్యమంత్రి వెంటే ఉన్నారని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసిన హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.