Gunti Jangayya Colony | గుంటి జంగయ్య కాలనీ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

హయత్‌నగర్ : ప్రభుత్వం దృష్టికి ఎల్బీనగర్ గుంటి జంగయ్య కాలనీవాసుల సమస్యను తీసుకెళ్లి భూ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్న నేపథ్యంలో వనస్థలిపురం డివిజన్ పరిధిలోని లాల్బదూర్ నగర్ రెవెన్యూ విలేజ్ గుంటి జంగయ్యనగర్ కాలనీ బస్తీవాసులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
దాదాపు 12 ఎకరాల స్థలంలో 700 ఇండ్లు ఉన్నాయని, గతంలో 58, 59 జీఓ కింద కొన్ని ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేశా రని, మిగతా ఇండ్లకు కూడా 58, 59 జీఓల కింద రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాలనీవాసుల రిజిస్ట్రేషన్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గోని శ్రీధర్, బస్తీవాసులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

