
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 18 : హరిత పాలమూరే లక్ష్యమని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్ప ష్టం చేశారు. ఇందుకోసం విరివిగా మొ క్కలు నాటి పట్టణాన్ని పచ్చగా మార్చాలని పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఎదుట జాతీయ ర హదారిపై ఉన్న డివైడర్ల మధ్యలో పొడవాటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా మొక్కలు నాటి మట్టి వేసి నీళ్లు పోశా రు. అనంతరం మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌కు స మాంతరంగా మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. 2014 కంటే ముందు పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని, నే డు ఊహించని రీతిలో అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని తెలిపారు. మిషన్ భగీరథ నీటి సరఫరాతో ఆడపడుచులకు తా గునీటి కష్టాలు తీరాయన్నారు. ప్రతి వా ర్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని పేర్కొన్నారు. ఏడేండ్లుగా పెద్ద ఎత్తున మొ క్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో, ఖాళీ స్థలాల్లో అంద రూ మొక్కలు నాటేందుకు నడుంబిగించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి నుంచి ఆర్టీఏ కార్యాలయం వరకు హైవేపై సెంట్రల్ డివైడర్ల మధ్య లో మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. నాటిన ప్రతిమొక్కకూ డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇప్పటికే పట్టణంలోని పార్కులు, జంక్షన్లను అభివృద్ధి చేశామని తెలిపారు. వెనుకబడిన టీడీగుట్ట, వీరన్నపేట ప్రాంతాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్ అంగీకరించారని, దీంతో త్వరలోనే వివిధ కంపెనీలు వెలుస్తాయని తెలిపారు. హన్వాడలో ఫుడ్ పార్కు ఏర్పాటు చేయడంతో యువతకు ఉపాధి అవకాశలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు వనజ, ఆనంద్‌గౌడ్, కట్టా రవికిషన్‌రెడ్డి, షబ్బీర్, షేక్ఉమర్, రామ్, ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు జ్యోతి, మాజీ కౌన్సిలర్లు కృష్ణ మోహన్, గోపాల్ యాదవ్, వెంకన్న, నాయకులు శివరాజ్, మోసిన్, హన్మంతు, శాంతయ్య, పాపారాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.