మనోహరాబాద్/ చేగుంట/పెద్దశంకరంపేట/ రామాయం పేట/వెల్దుర్తి/చిన్నశంకరంపేట/నర్సాపూర్/తూప్రాన్ రూరల్/మెదక్, జనవరి 7 : రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మార్కెట్ కమిటీ ఆవరణలో రైతు బంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను సన్మానించారు. రైతుపక్షపాతి సీఎం కేసీఆర్ అని మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అన్నారు. హరితహారంలో భాగంగా గ్రామాలను పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారి షాబొద్దీన్, ఏఎంసీ సెక్రటరీ ఉష, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాయిలు, మెడిశెట్టి శంకర్, కండెల నర్సింహులు, ఇందాజ్, కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, ఏఈవోలు ప్రవీణ్, శేఖర్ పాల్గొన్నారు. తూప్రాన్ మండలం గుండ్రేడుపల్లి, ఇమాంపూర్ గ్రామాల్లో సర్పంచ్‌లు, వ్యవసాయశాఖ అధికారులు, రైతుల ఆధ్యర్యంలో రైతుబంధు సంబురాలు జరుపుకొన్నారు.నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్ బహుమతులు అందజేశారు. ఏఈవోలు ప్రసాద్, శ్రీధర్ ఉన్నారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని ఖాజాపూర్ ప్రాథమిక పాఠశాలలో రైతుబంధు వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో ఆటలు నిర్వహించారు. రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వెల్దుర్తి మండలం రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ అధ్యక్షుడు అనంతరెడ్డిపాల్గొని బహుమతులు ఇచ్చారు. ధర్మారంలో రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వెల్దుర్తిలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్పంచ్ భాగ్యమ్మ నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ప్రీతి, శంకర్‌రెడ్డి, లత, నరేం దర్‌రెడ్డి, నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డి, మ హేందర్‌రెడ్డి, శివకుమార్, సత్యంగౌడ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన, వక్తుత్వ పోటీలు నిర్వహించారు. విద్యాధికారి నీలకంఠం పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
రామాయంపేటలో..
రామాయంపేట మండలం కాట్రియాల, శివ్వాయపల్లె గ్రామాల్లో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. విద్యార్థులకు ముగ్గులు, వ్యాసరచన పోటీలను నిర్వహించి, బహుమతులు అందజేశారు. శివ్వాయ పల్లెలో సర్పం చ్ మల్లేశం రైతులకు స్వీట్లు పంచారు. కార్యక్రమాల్లో డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు వసంత సుగుణ, వ్యవసాయాధికారులు వినోద్ కుమార్, సాయి కృష్ణ, సర్పంచ్ శ్యా ములు, ఉపసర్పంచ్ స్రవంతి పాల్గొన్నారు. పెద్దశంకరంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
చేగుంటలో..
చేగుంట, నార్సింగి మండలాల్లో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. భీంరావ్పల్లిలో నిర్వహించిన రైతు బంధు సంబురాల్లో నార్సింగి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైలరాం బాబు, ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి పాల్గొని ర్యాలీ నిర్వహించారు.
రైతుబంధు అద్భుత పథకం
రైతుబంధు ఓఅద్భుత పథకమని, చరిత్రలో ఓ అధ్యాయనంగా రైతుబంధు నిలుస్తున్నదని రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ జడ్పీహెచ్ పాఠశాలలో ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్ ఆధ్వర్యంలో రైతుబంధుపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులను అందజేశారు.