e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home జిల్లాలు Azadi ka amrut mahotsav | కంటోన్మెంట్‌లో ఉత్సాహంగా సాగిన 5కే రన్‌

Azadi ka amrut mahotsav | కంటోన్మెంట్‌లో ఉత్సాహంగా సాగిన 5కే రన్‌

సికింద్రాబాద్ : అజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కంటోన్మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో సిఖ్‌విలేజ్‌లోని హాకీ మైదానం వద్ద 5కే రన్‌ను నిర్వహించారు. ఆదివారం ఉదయం హాకీ మైదానంలో ఎమ్మెల్యే సాయన్న, జీఓసీ ప్రీతిపాల్‌ సింగ్‌, టీవీ నటుడు ఆలీ రెజా, బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డిలతో కలిసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జెండా ఊపి 5కే రన్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కంటోన్మెంట్‌ సిబ్బందిని, సీఈఓ అజిత్‌రెడ్డిని ఎమ్మెల్యే సాయన్న, మంత్రి మల్లారెడ్డి అభినందించారు. యువతీ యువకులతో పాటు పలువురు ప్రముఖులు మారథాన్‌ కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. సుమారు 3వేల మంది వరకు 5కే రన్‌లో పాల్గొనడం జరిగింది. 5కే రన్‌ సిఖ్‌విలేజ్‌ నుంచి డైమండ్‌ పాయింట్‌, ఎన్‌సీసీ గ్రౌండ్‌, టివోలి మీదుగా హాకీ మైదానానికి చేరుకుంది.

- Advertisement -


నృత్యం చేసిన బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి..
5కే రన్‌లో భాగంగా సిఖ్‌విలేజ్‌ హాకీ మైదానంలో ప్రారంభ కార్యక్రమంలో నృత్యంతో కంటోన్మెంట్‌ బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి అలరించారు. యువతీ యువకులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్​‍ చేస్తూ స్ఫూర్తిని రగిలించారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ లాస్యనందితా, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్‌, ప్రభాకర్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్, తేజ్‌పాల్‌, మురళీయాదవ్‌, బోర్డు ఇంజనీర్లు గోపాల్‌కృష్ణదాస్, రాములు, బాలకృష్ణ, ఫణికుమార్‌, దినేష్‌, సాగర్‌తో పాటు శానిటేషన్‌ అధికారి దేవేందర్‌, కంటోన్మెంట్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, ఆయా కాలనీలవాసులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement