రైతు గోడు వినని కేంద్ర ప్రభుత్వంపై అన్నదాతలు చావుడప్పు మోగించారు. వడ్ల కొనుగోలులో చూపుతున్న నిర్లక్ష్యంపై నిరసనలతో సెగ పుట్టించారు. మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరిని అడుగడుగునా ఎండగట్టాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సోమవారం పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండివైఖరిని నిరసిస్తూ ఊరూరా దిష్టిబొమ్మలను దహనం చేశారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నాయకత్వంలో కేంద్రప్రభుత్వ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నేతలు తమ తమ నియోజకవర్గాల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు.
-నిజామాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) డిసెంబర్ 20 : యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు ‘చావుడప్పు’ పేరుతో జిల్లాలోని ప్రతి గ్రామంలో సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
నిజాంసాగర్ మండలకేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు. పెద్దకొడప్గల్లో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ దేశాయ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
పిట్లంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కవితావిజయ్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రజినీకాంత్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, విండో చైర్మన్లు నారాయణరెడ్డి, సాయిరెడ్డి, శపథంరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్పీటీసీ సభ్యుడు ఉషాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఏగుల నర్సింహులు, నాయకులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలం మత్తమాల గ్రామంలో సర్పంచ్ అశోక్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ఉషాగౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలో జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ప్రాంగణంలో చావుడప్పు మోగించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ నర్సింహులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్ధయ్య, ఉపాధ్యక్షుడు దివిటి కిష్టయ్య, జనరల్ సెక్రటరీ మంగళి యాదగిరి, మాజీ చైర్మన్ రాజారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణ, మాజీ సర్పంచ్ బోయిని విఠల్ తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్‌లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లిపెల్లి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గైని అనసూయ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
బిచ్కుందలోని బస్టాండ్ వద్ద ఎంపీపీ అశోక్ పటేల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్రావు, సొసైటీ చైర్మన్ బాలాజీ, జడ్పీటీసీ సభ్యురాలు భారతీరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డిలో స్థానిక ప్రజాత్రినిధులు, నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ రామారెడ్డి జనరల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భానూరి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు చావు డప్పు కొట్టించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఎంపీపీ రవి, వైస్ ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి గోపాల్‌రావు, సొసైటీ చైర్మన్ కపిల్‌రెడ్డి పాల్గొన్నారు.
బీబీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలమణి, వైస్ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నాగరాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ మండలకేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండ్ర మధుసూదన్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్‌గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సదానంద, ఎంపీటీసీలు రమేశ్, శారద, ఫిరంగి రాజేశ్వర్, దోర్నాల లక్ష్మి, ఆసాని జ్యోతి, సర్పంచులు అంజలి, ధర్పల్లి స్వరూప, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి మండల పరిషత్ కార్యాలయం ఎదుట జడ్పీటీసీ సభ్యుడు మిన్కూరి రాంరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పగడాల బాల్‌చంద్రం, మండల ప్రధానకార్యదర్శి రాజాగౌడ్ పాల్గొన్నారు.
గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దుర్గం శివాజీ, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యం, ఉపసర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొమ్మల రమేశ్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తఫా, గొల్లాడి సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో మోదీ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.