వనపర్తి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాకు మరో మూడు నూతన సబ్స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి కోసం రూ.5.63 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు విద్యుత్‌శాఖ ఎండీ రఘుమారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖిల్లాఘణపురం మండలం అల్లమాయపల్లి, పెద్దమందడి మండలం మంగంపల్లి, శ్రీరంగాపురం మండలం తాటిపాములకు 33/11 కేవీ సబ్స్టేషన్లు మంజూరయ్యాయి. వీటిని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏడేండ్లలో దాదాపు వనపర్తి నియోజకవర్గానికి 18 సబ్స్టేషన్లు మంజూరయ్యాయి. వీటిలో 14 స్టేషన్లు నిర్మాణం పూర్తవగా.. ప్రస్తుతం మరో మూడింటిని మంజూరు చేశారు. అల్లమాయపల్లి సబ్‌స్టేషన్‌కు రూ.1.87 కోట్లు, తాటిపాముల సబ్‌స్టేషన్‌కు రూ.1.82 కోట్లు, మంగంపల్లికి రూ.1.85 కోట్లు మంజూరు చేశారు.