ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగం హెడ్‌గా డాక్టర్ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హెడ్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఈ నియామకాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు అభినందించారు.