అడ్డగుట్ట : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు అదృశ్యమైన ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డగుట్ట బీ సెక్షన్ ప్రాంతానికి చెందిన మధుకుమార్ ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు నాలుగేళ్ల క్రితం మంజుల (21)తో వివాహమైంది. వారికి రెండేళ్ల క్రితం హిమశ్రీ అనే పాప జన్మించింది.
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మంజుల (21), హిమశ్రీ (2) ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడిన మధుకుమార్ తన బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.