యాదాద్రి, డిసెంబర్ 20 : చావు డప్పులు, శవయాత్రలతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రైతులు ఎండగట్టారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ ఆలేరు నియోజకవర్గవ్యాప్తంగా రైతులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఆందోళనలు నిర్వహించారు. టీఆర్ఎస్ ఆధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ సోమవారం పల్లె పల్లెనా నిరసన గళం విప్పారు. మోదీ దిష్టి బొమ్మకు శవయాత్ర చేపట్టి దహనం చేశారు. ఆలేరు పట్టణంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాల్గొని మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి ప్రధాన కూడలి వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోందని బీజేపీపై మండి పడ్డారు. మోదీ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొంటారా? కొనరా? అని ప్రశ్నించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కిషన్‌రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే ప్రధానిని ఒప్పించి యాసంగిలో వడ్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు బాగుపడాలంటే బీజేపీని ఓడించాలన్నారు. యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, నాయకులు మిట్ట వెంకటయ్య, పెలిమెల్లి శ్రీధర్, అంకం నర్సింహ, ముక్కెర్ల సతీశ్ యాదవ్, పేరబోయిన సత్యనారాయణ, కీసరి బాలరాజు, కసావు శ్రీనివాస్, కాంటేకర్ పవన్, రాజాపేటలో జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, భిక్షపతి గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, సంతోష్‌గౌడ్, మోత్కుపల్లి ప్రవీణ్, కొమ్ము పాండు పాల్గొన్నారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్‌కుమార్, టీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్‌యాదవ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరు(ఎం)లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయగా సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేశ్‌గౌడ్, యాస శ్రీనివాస్‌రెడ్డి, యాస రంగారెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, జిల్లా సభ్యులు కోరె భిక్షపతి, బీసు ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దశరథగౌడ్, ఎంపీటీసీ యాస కవిత, మహిళా నాయకులు సోలిపురం అరుణ, మాజీ మండలాధ్యక్షుడు బాషబోయిన ఉప్పలయ్య పాల్గొన్నారు. గుండాలలో పార్టీ అధ్యక్షుడు ఖలీల్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్, రాములు, రంజిత్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. మోటకొండూర్‌లో పార్టీ అధ్యక్షుడు బొట్ల యాదయ్య, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్ అయిలయ్య, నాయకులు బాల య్య, బురాన్, మదర్ డెయిరీ డైరెక్టర్ లింగాల శ్రీకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కోశాధికారి చల్లా విజయ్‌రెడ్డి, ఆలేరు పట్టణంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి
భువనగిరి అర్బన్ : రాష్ట్రంలో యాసంగిలో రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిర్వహించిన ప్రధాని మోదీ శవయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాసంగి పంటను కొనుగోలు చేయకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా రైతుల దాడులు మొదలవుతాయన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని టీఆర్ఎస్ గ్రామశాఖల ఆధ్వర్యంలో ప్రధిని మోదీ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ బీబీనగర్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, ఎంపీపీ సుధాకర్‌గౌడ్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ స్థాయి సంఘం చైర్మన్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మిశ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతుల వెన్నంటి రాష్ట్ర ప్రభుత్వం
భువనగిరి అర్బన్ : రైతుల కష్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వమే తీర్చిందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ప్రధాని మోదీ శవయాత్ర నిర్వహించి స్థానిక వినాయకచౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం యాసంగిలో పండించిన పంటను కొనుగోలు చేయాలని డిమండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోబోమని, రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, నీల ఓంప్రకాశ్‌గౌడ్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, చందుపట్ల వెంకటేశ్వర్రావు, రాజేశ్వర్‌రావు, పద్మ, అతికం లక్ష్మీనారాయణగౌడ్, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జక్క రాఘవేందర్‌రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, వెంకట్‌గౌడ్, వెంకటేశ్, శ్రీనివాస్, మల్లికార్జున్, పాండు, మధు, దేవేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
వలిగొండ మండలంలో పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ సురకంటి వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కునపురి కవిత, మత్స్యగిరి గుట్ట ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శులు మామిళ్ల రత్నయ్య, అయిటిపాముల రవీందర్, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు మద్దెల మంజుల నాగరాజు, పట్టణాధ్యక్షుడు లింగస్వామి, కొమురెల్లి సంజీవరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు డేగల పాండరి, మాద శంకర్‌గౌడ్, పోలేపాక సత్యనారాయణ, ఎలిమినేటి సత్యనారాయణ, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.