
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం వివిధ మండలాలు,గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నల్లరంగు దుస్తులు, బ్యాడ్జీలు ధరించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర విధానాలపై నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అన్నదాతను ఆగంచేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఊట్కూర్/మరికల్/మద్దూర్/దామరగిద్ద/ధన్వాడ/నర్వ/నారాయణపేటరూరల్: డిసెంబర్ 20: ఊట్కూర్ మండలకేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. స్థానిక పంచ్ మజీద్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. పురవీధుల్లో చావు డప్పులు మోగిస్తూ నినాదాలు చేశారు. అంబేద్కర్ కూడలిలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం యాసంగి వడ్లను కొనుగోలు చేయమని చెప్పడం దారుణమన్నారు. కార్యక్రమం లో మాజీ విండో అధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ జె డ్పీటీసీ అరవింద్‌కుమార్, మండల కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహిమాన్, ఉప సర్పంచ్ ఇబాదుర్హ్రిమాన్, ఎంపీటీసీ భీమమ్మ, టీఆర్ఎస్ మండల, గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు శివరామరాజు, గోవిందప్ప, వెంకటేశ్‌గౌడ్, కావలి సురేశ్, నసీర్‌ఖాన్, మహేశ్‌రెడ్డి, సచిన్, జమీర్, చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
మరికల్లో..
తెలంగాణ రైతులు పండించిన వరి పంటను కొనకపోతే బీజేపీకి రైతులు ఉరేస్తారని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతయ్య ఆన్నారు. సోమవారం చావు డప్పు కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను ఊరేగించిన అనంతరం తెలంగాణ చౌరస్తాలో దహనం చేశారు. కార్యక్రమం లో రాజవర్ధన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీ సూజాత. సర్పంచ్ కస్పే గోవర్ధన్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ సంపత్ కుమార్, నాయకులు రామస్వామి, కృష్ణారెడ్డి, రాజేశ్, ప్రవీణ్, బీసీ విభాగం మండల అధ్యక్షుడు గాదం మల్లేశ్, జగదీశ్, అశోక్‌కుమార్, సూరిటి చంద్రశేఖర్, శ్రీనివాసులు, మండల కోఆప్షన్ సభ్యులు మతీన్, మోహన్‌రెడ్డి, పుల్లయ్యగౌడ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని రాకొండ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ చావు డప్పుల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్ర మంలో బీసీ విభాగం మండల అధ్యక్షుడు గాదం మల్లే శ్, ఉప సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు నరహరితో పాటు రైతులు పాల్గొన్నారు.
మద్దూరులో..
మద్దూర్ పట్టణంతోపాటు ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్త్తూ నిరసన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సి.వెంకటయ్య, కోస్గి మార్కెట్ చైర్మన్ వీరారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ జగదీశ్, నాయకులు సలీం,హన్మిరెడ్డి, వీరేశ్‌గౌడ్, వంచర్ల గోపాల్, విజయభాస్కర్‌రెడ్డి, బసిరెడ్డి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
దామరగిద్దలో..
మండలంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీ, చావు డప్పు కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రం లో టీఆర్ఎస్ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో కేంద్రప్రభుత్వ దృష్టి బొమ్మను దహనం చేశారు. ఎంపీపీ బక్క నర్సప్ప మాట్లాడుతూ వ్యవసాయ దారుల విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడం మూలంగా రైతులకు అధిక భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమి తి జిల్లా నాయకుడు వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ కిషన్‌రావు, సర్పంచ్ వన్నడి ఆశమ్మ, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ధన్వాడలో..
కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని టీఆర్ఎస్ ధన్వాడ మండల ఇన్చార్జి రాజవర్ధన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. ధన్వాడలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చావుడప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి రోడ్డుపై దహనం చేశారు. అంతకుముందు గంటపాటుగా రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిష్టాపూర్, కొండాపూర్, గున్ముక్ల, రాంకిష్టయ్యపల్లి, మంత్రోన్పల్లి తదితర గ్రామాల్లో చావుడప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ధన్వాడ సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సుధీర్కూమార్, చాకలి చంద్రశేఖర్, కొండారెడ్డి, సునీల్‌రెడ్డి, గండి బాలరాజు, సచిన్, శివాజీ, పటేల్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
నర్వ మండలంలో..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేయాలని నర్వ సింగిల్‌విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నాయకులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ కూడలిలో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలంలోని లంకాల, ఉందెకోడ్, కల్వాల్, పెద్దకడుమూర్, రాయికోడ్ తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మండ్ల చిన్నయ్య, నాయకులు డాక్టర్ బాబు, గడ్డం నర్సింహ, దండు అయ్యప్ప, దండు శంకర్, నెల్లూరి వెంకటయ్య, బాల్దాసు, కేశవులు పాల్గొన్నారు.
వివిధ గ్రామాల్లో..
పేట మండలంలోని కోటకొండ, మోఖహనుమాన్తండా, కొల్లంపల్లి, బొమ్మన్‌పాడ్, అప్పిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి చావు డప్పులతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేపూరి రాములు, యువజన విభాగం అధ్యక్షుడు మోహన్‌నాయక్, గోపాల్‌నాయక్, ఉపసర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.