Milad un nabi | మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దానం

బంజారాహిల్స్ : మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని మంగళవారం ఖైరతా బాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ముస్లీంలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించడంతో పాటు శాంతి యాత్రలు చేపట్టారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా సాంప్రదాయ వస్త్రధారణతో శాంతియాత్రల్లో పాల్గొన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని మసీదు వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జల్సాను ప్రారంభించారు. దేవర కొండబస్తీ, సింగాడకుంట. బంజారాహిల్స్ రోడ్ నెం 12, శ్రీరాంనగర్, బోళాశంకర్ నగర్, కాజానగర్ తదితర ప్రాంతాల్లో జల్సా కొనసాగింది. దారిపొడవునా ఖవ్వాలీలతో పాటు డప్పుల హోరుతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో జల్సాలో పాల్గొనే వారికోసం ప్రత్యేకంగా అన్నదానం ఏర్పాటు చేశారు.
మిలాద్ ఉన్ నబీ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజా గుట్ట, సైఫాబాద్ పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

