బండ్లగూడ: రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో కోటి 74 లక్షల రూపాయాలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి తగినన్ని నిధులను మంజూరుచేసి అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు.ఇప్పటికే అనేక బస్తీలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. దశల వారిగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చడం జరుగుతుందన్నారు. ప్రజలకు సమస్యలు ఉంటే స్థానిక ప్రజా ప్రతినిధులతో కానీ నేరుగా కాని తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్‌గౌడ్, డిప్యూటి మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు శ్రీలతసురేశ్గౌడ్, సంతోషిరాజిరెడ్డి, అనితవెంకటేష్, లతప్రేంగౌడ్, కోఅష్షన్ నాయకులు మాలాకీరత్నం, వెంకట్‌రెడ్డి, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్,నాయకులు రావులకోళ్ల నాగరాజు, పపాయ్య యాదవ్, సహదేవ్‌గౌడ్,సుమన్‌గౌడ్,రాజు,గోపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.