యాదాద్రి, డిసెంబర్ 30 : నల్లగొండ సహకార బ్యాంకు టర్నోవర్‌ను రూ.1,650 కోట్లకు పెంచి 103 ఏళ్ల బ్యాంకు చరిత్రను తిరగ రాశామని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. పదవీకాలంలోపు బ్యాంకు టర్నోవర్‌ను రూ.3వేల కోట్లకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ రూపొందించిన కొత్త సంవత్సర క్యాలండర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడా రు. గత వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 107 పీఏసీఎస్‌ల పరిధిలో రూ.170కోట్ల స్వల్పకాలిక రుణాలను అందజేశామని తెలిపారు. మరో 50 కో ట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనిఅన్నారు.కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, డైరెక్టర్లు అనంతుల జంగారెడ్డి, గుగులోతు బద్దునాయక్, పత్తిపాటి మంజుల, అయిలయ్య, కృష్ణ, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, నర్సింహ, బాలరాజు, భాస్కర్ పాల్గొన్నారు.