
వనపర్తి, డిసెంబర్ 20 : ఈ నెల 23వ తేదీన సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటన వాయిదా పడినట్లు టీఆర్ఎస్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ శ్యాంకుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులను కలిసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సారథ్యంలో ఆరుగురు మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లిందని పేర్కొన్నారు. ఢిల్లీలో మంత్రి నిరంజన్‌రెడ్డి ఉన్నందున సీఎం పర్యటన వాయిదా పడిందన్నారు. తదుపరి తేదీని మంత్రి నిరంజన్‌రెడ్డి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలియజేస్తామన్నారు.