ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల అందజేత
చర్లపల్లి, డిసెంబర్ 4 : పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభు త్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, అర్హులైన వారు ఆ పథకాలను సద్వినియోగం చేసుకొని.. ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. సర్కిల్ పరిధిలోని కాప్రా, రామంతాపూర్, చర్లపల్లి, హబ్సిగూడ, ఏఎస్‌రావునగర్ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఆయన వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలను ప్రవేశపెడుతున్నారని, ముఖ్యంగా పేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వార ఆర్థిక సహాయం అందించడం దేశచరిత్రలో మరిచిపోలేనిదన్నారు. ఈ పథకాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలోని వేలాది మంది పేదలు, కు టుంబాలకు వివిధ పథకాల ద్వార లబ్ధి చేకూరిందని ఆయన గుర్తు చేశారు.
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన సాగిస్తున్నారన్నారు. అనంతరం మర్రి రాజశేఖర్‌రెడ్డి, తాసీల్దార్లు గౌతంకుమార్, అనిత ప్రసంగించారు.
కార్యక్రమంలో చర్లపల్లి, హబ్సిగూడ, రామంతాపూ ర్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, హరీష్చేతన, బండారు శ్రీవాణి వెంకటరావు , మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, బద్దం భాస్కర్రెరెడ్డి, గడ్డం రవికుమార్, బేతాల బాల్‌రాజు, గరిక సుధాకర్, బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్, కాసం మహిపాల్‌రెడ్డి, డప్పు గిరిబాబు, బీవీచారి, ఎండీ ముస్తాక్, వేముల సంతోష్‌రెడ్డి, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, అనిల్, కంచర్ల సోమిరెడ్డి, జేసీబీ రాజు, గంప కృష్ణ, శ్రీకాంత్‌రెడ్డి, నర్సింహాగౌడ్, రాధాకృష్ణ, డిప్యూటీ తాసీల్దార్ మహ్మద్ రఫీ, ఆర్ఐ వహిదా, అజీమ్, సిబ్బంది అనంతరాములు, నరేందర్, సుమన్, నాగలక్ష్మి పాల్గొన్నారు.