
కూసుమంచి, డిసెంబర్ 30: అనారోగ్యంతో ఉన్న పేదవారికి ఆర్థిక చేయూత అందించే ఆలోచనతో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తున్నదని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంని క్యాంపు కార్యాలయంలో గురువారం కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, వజ్జా రమ్య, పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, పాషబోయిన వీరన్న, నాయకులు సర్పంచ్‌లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, డిసెంబర్ 30: సీఎంఆర్ఎఫ్ పేదలకు భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు రూ.21లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం దానవాయిగూడెం కాలనీకి చెందిన దామల రవి తల్లి లక్ష్మీబాయి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎంపీపీ బెల్లం ఉమా, వైఎస్ ఎంపీపీ గుడిబోయిన దరగయ్య, మండల అధ్యక్షుడు బెల్లం వేణు, సుడా డైరెక్టర్ గుడా సంజీవరెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు, కొప్పుల ఆంజనేయులు, ముత్యం కృష్ణారావు, చిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, చుంచు నారాయణ, బానోతు మోహన్‌నాయక్, మానుకొండ శ్రీను, నల్లూరి మధుబాబు, బట్టపోతుల సతీశ్, కొండలు, రమణయ్య పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
తిరుమలాయపాలెం, డిసెంబర్ 30: మండలంలోని జింకలగూడెంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సయ్యద్ చిన్న మదార్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి గురువారం పరామర్శించారు. అనంతరం పిండిప్రోలులో మాజీ సర్పంచ్ తాతా భిక్షమయ్యను పరామర్శించారు. ఎంపీపీ బోడ మంగీలాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వీరన్న, దేవేందర్‌రెడ్డి, తిరుమలాయపాలెం సొసైటీ చైర్మన్ వేణు, రైతుబంధు మండల కన్వీనర్ శివరామకృష్ణ, గోల్తండ సర్పంచ్ రంగ, రాజు, శ్రీలత పాల్గొన్నారు. జింకలగూడెంలో ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చిన్న మదార్ కుటుంబాన్ని టీఆర్ఎస్ నాయకురాలు స్వర్ణకుమారి పరామర్శించారు.
కూసుమంచి రూరల్, డిసెంబర్ 30: మండల పరిధిలోని పోచారంలో ఇటీవల మృతిచెందిన ఇందు ర్తి రామిరెడ్డికి ఎమ్మెల్యే కందాళ నివాళుర్పించారు. ఎమ్మెల్యే వెంట పాలేరు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్, డీసీసీబీ డైరక్టర్ శేఖర్‌రావు, టీఆర్ఎస్ అధ్యక్షుడు మండల వీరయ్య, కార్యదర్శి ఆసిఫ్‌పాషా ఉన్నారు.