వేడుకల్లో పాల్గొన్న శేరి సుభాష్‌రెడ్డి
రామాయంపేట, డిసెంబర్ 24: క్రిస్మస్ వేడుకలను భక్తిశ్రద్ధ్దలతో జరుపుకోవాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ సర్పంచ్ శివప్రసాద్‌రావు నూతన గృహ ప్రవేశానికి హాజరై క్రిస్మస్ వేడుకలో పాల్గొని కేక్ కట్ చేశారు.కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్య, నిజాంపే ట జడ్పీటీసీ విజయ్‌కుమార్, దామరచెర్వు సర్పంచ్ శివప్రసాద్‌రావు, సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్‌రావు, చంద్రశేఖర్‌రావు, టీఆర్ఎస్వీ నాయకులు రవితేజ తదితరులున్నారు.
పెద్దశంకరంపేట…
పెద్దశంకరంపేట,డిసెంబర్ 24: నేడు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించడానికి చర్చిలను ము స్తాబు చేస్తున్నారు. పెద్దశంకరంపేట మండలంలో క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనా మందిరాలు సిద్ధ్దమయాయ్యి.క్రిస్మస్ సందర్భం గా ఆయా చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే సందర్భంగా అందంగా అలంకరిస్తున్నారు.
తూప్రాన్‌లో సంబురాలు
మనోహరాబాద్, డిసెంబర్ 24: తూప్రాన్ గీతా స్కూల్లో విద్యార్థులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పశువులపాక ఏర్పాటు చేశారు. శాంతాక్లాజ్, మేరీమాత వేషధారణలో సందడి చేశా రు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయులు,చైర్ పర్సన్ ఉష, డైరెక్టర్, మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, డైరెక్టర్ నారాయణ, ప్రిన్సిపాల్ వెంకటకృష్ణారావు, ఇన్చారి ప్రిన్సిఊపాల్ ప్రేంరాజ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మెదక్ రూరల్..
మెదక్ రూరల్, డిసెంబర్ 24: క్రిస్మస్ పం డుగను పురస్కరించుకొని మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి గీతాపాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. చిన్నారులు చేసిన నృత్యం అందరిని ఆకట్టుకున్నది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు మాధవి రామాంజనేయు లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రిస్మస్ శుభాకాంక్షలుతెలిపిన మున్సిపల్ చైర్మన్
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 24: మెదక్ పట్టణ ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో క్రిస్మస్ శుభకాంక్షలు తెలియజేశారు.