
రేవల్లి, డిసెంబర్ 9 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దళారుల ప్రమేయం లే కుండా పారదర్శకంగా లబ్ధిదారులకే అందుతున్నా యి. కానీ రేవల్లి మండలంలో మాత్రం అధికారుల అలసత్వం కారణంగా అందుకు భిన్నంగా జరుగుతున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు.. రేవల్లి మండలకేంద్రానికి చెందిన గడ్డల పార్వతమ్మ మూ డు నెలల కిందట తన కూతురుకు చీర్కపల్లికి చెంది న యువకుడితో వివాహం జరిపించింది. బిడ్డ పెం డ్లి చేసినందుకు ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి పథ కం ద్వారా డబ్బులు వస్తాయని అదే గ్రామానికి చెం దిన ఎండీ ఖాజా, ప్రవీణ్ ఆమెను ప్రలోభపెట్టారు. డబ్బులు వచ్చేలా చూస్తామని పార్వతమ్మను నమ్మించి ఆమె వద్ద నుంచి రూ.20 వేలు వసూలు చేశారు. మూడు నెలలు కావస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఆమె తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేసింది. అప్పుడే అసలు విషయం బయటపడింది. అసలు ఆమె బిడ్డ పెండ్లికి సంబంధించిన దరఖాస్తు కార్యాలయానికే చేరలేదని తెలిసి అవాక్కైంది. మోసపోయాయని తెలుసుకున్నది. తర్వాత వాకబు చేయగా.. కల్యాణలక్ష్మి డబ్బులు ఇప్పిస్తామని మరో 15 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని తెలుసుకొని మోసపోయాయని గ్రహించిం ది. ఈనెల2న ఖాజాను ఈ విషయమై పార్వతమ్మ ప్రశ్నించగా.. నేనొక్కడినే డబ్బులు తీసుకున్నానా.. అంటూ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. గట్టిగా నిలదీయడంతో పార్వతమ్మతోపాటు ఆమె భర్త కృ ష్ణయ్యపై ఖాజా దాడి చేశారని స్థానికులు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వె ళ్లగా నేడు, రేపు అంటూ కాలయాపన చేశారని బాధితురాలు పార్వతమ్మ వాపోయింది. చేసేదేమీ లేక మ రో వ్యక్తి ప్రవీణ్ వద్దకు వెళ్లి డబ్బుల విషయమై ప్రా ధేయపడగా.. తన పరువును బజారుకు ఈడ్చుతున్నారని దుర్భాషలాడాడని ఆమె కన్నీరు పెట్టుకున్న ది. వారం రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిం ది. తమపై దాడి చేసిన వారు మాత్రం దర్జాగా గ్రా మంలో తిరుగుతున్నారని తెలిపింది. చివరకు 100కు డయల్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసినట్లు బాధితురాలు తెలిపింది. కాగా, ఈ విషయ మై ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా తమకు ఎవ రూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
నన్ను కొట్టిండ్రు..
నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని కొద్ది రోజుల్లోనే క ల్యాణలక్ష్మి డబ్బులు ఇప్పిస్తానని మోసం చేసిండ్రు. నా దగ్గర రూ.20 వేలు తీసుకొ ని పనిచేయకపోగా అడిగినందుకు నాపై, భర్తపై దాడి చేసి కొట్టిండ్రు. వారం రోజులు గా పోలీసులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదు. 100కు ఫోన్ చెస్తే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకొని వివరాలు రాసుకొని పంపించారు.
కాన్పు డబ్బులు ఇప్పిస్తామన్నారు..
తెలంగాణ కార్మిక శాఖ లో కార్మికుడిగా నమోదైన నా కుటుంబానికి చెందిన ఆడకూతురుకు మొదటి కా న్పు సమయంలో రూ.30 వేలు రావాల్సి ఉన్నది. కొం దరు మధ్యవర్తులు వచ్చి తా ము డబ్బులు ఇప్పిస్తానని రూ.5 వేలు అడిగారు. రూ.3 వేలు ఇచ్చాను. 8 నెలలు గడిచినా డబ్బులు రాకపోవడంతో 100కు ఫోన్ చేసి చెప్పాను. పోలీసుల ప్రమేయంతో అందుకు సంబంధించిన కాగితాలు ఇచ్చి.. డబ్బులు నేటికీ ఇవ్వలేదు. – వడ్ల చంద్రకళ