సంగారెడ్డి, జనవరి 5(నమస్తే తెలంగాణ)/ మెదక్/సిద్దిపేట: మెదక్ జిల్లా ఓటర్ల లెక్క తేలింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం మెదక్ జిల్లాలో 4,11,270 మంది ఓటర్లు ఉన్నా రు. ఇందులో పురుషులు 2,00,470 మంది, 2,10,792 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్‌లో 8 మంది ఉన్నారు. తాజాగా విడుదలైన జాబితా ప్రకారం మెదక్ జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గత నవంబర్‌లో విడుదల చేసిన జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ తుది జాబితాను రూపొందించారు. మెదక్ జిల్లాలో 576 పోలింగ్ స్టేష న్లు ఏర్పాటు చేశారు. నవంబర్ 1, 2021 నాటికి జిల్లా లో 4,13, 517 మంది ఓటర్లు ఉండగా, ఫారం-6, 6ఏలో 4,76 9 మంది జాబితాలో చేర్చగా, ఫారం-7లో 7,016 మందిని తొలిగించారు. దీంతో 4,11, 270 మంది ఓటర్లు ఉన్నట్టు తుది జాబితా విడుదల చేశారు.
మెదక్ జిల్లాలో 4,11,270 మంది ఓటర్లు..
మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. అం దులో మెదక్ నియోజకవర్గంలో 2,03,979 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 98,120 మంది ఉన్నారు. మహిళలు 1,05,857 మంది ఉన్నారు. థర్డ్ జెండర్‌లో ఇద్దరు ఉన్నారు. ఇదిలాఉండగా ఎన్ఆర్ఐ లో పురుషులు 7 మంది, మహిళ ఒకరు ఉన్నారు. మొత్తం 8 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 72 మంది మెంబర్లు, ఒకరు వేవ్స్ మొత్తం 73 మంది ఉన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో 2,07,291 మంది
నర్సాపూర్ నియోజకవర్గంలో 2,07,291 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,02,350 మంది ఉండగా, మహిళలు 1,04,935 మంది ఉన్నా రు. థర్డ్ జెండర్‌లో ఆరుగురు ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లలో పురుషులు ఒకరు ఉన్నారు. సర్వీస్ ఓటర్లలో మెంబర్లు 33 మంది, వేవ్స్ 2 మంది, మొత్తం 35 మంది ఉన్నారు. మొత్తంగా మెదక్ జిల్లాలో 4,11,270 మంది ఓటర్లు ఉండగా, అందులో 2,00,470 మంది పురుషులు, 2,10,792 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
మొదటిసారి గరుడ యాప్‌లో…
ఈ ఏడాది మొదటిసారిగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు ఎన్నికల కమిషన్ కొత్తగా గరుడ యాప్‌ను రూపొందించింది. బీఎల్వోలకు అవగాహన కల్పించి దాని ద్వారా ఓటరు నమోదు చేపట్టారు. బీఎల్వోలకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గరుడ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. కేవలం నాలుగు ప్రత్యేక రోజుల్లో నవంబర్ 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక ప్రచారం చేశారు.
సిద్దిపేట జిల్లాలో 8,99,369 మంది ఓటర్లు ..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ తుది ఓటర్ల బలాల జబితాను ప్రచురణను బుధవారం విడుదల చేసింది. జాబితా ప్రకారం సిద్దిపేట జిల్లాలో 1136 పోలింగ్ స్టేషన్లు, 8,99,369 మం దితో కూడిన జబితాను విడుదల చేసింది. ఎస్ఎస్ఆర్-2022డ్రాప్ట్ ప్రకారం 1 నవంబర్ 2021లో జిల్లాలో 9,10,806 మంది ఓటర్లు ఉండగా, ఇందులో ఆడిషన్ ప్రక్రియలో భాగంగా ఫారం-6, ఫా రం -6ఏతో 6634మంది ఓటర్లు, ఫారం-7 ద్వారా తొలిగించబడ్డవారు 18,071 ఓట ర్లు ఉండగా, మొత్తంగా 8,99,369 మంది ఓటర్లు ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 12,19,853 మంది ఓటర్లు..
సంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య 12,19,853కు చేరుకుంది. ఎన్నికల సంఘం ఇటీవల ఓటర్ల సవరణ చేపట్టింది. డిసెంబర్లో ముసాయిదా ఓటరు జాబితా వెలువరించగా, బుధవారం ఓటరు తుది జాబితాను ప్రకటించింది. సంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య 12,19,853కు చేరుకుంది. మహిళా ఓటర్లు సంఖ్య 6,02,273 ఉండగా పురుష ఓటర్లు 6,17,544 మంది ఉన్నారు. థర్డ్ జెండర్లు 36 మంది ఉండగా ఎన్ఆర్ఐ ఓటర్లు 74 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు మొత్తం 356 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లలో డిఫెన్స్‌లో పనిచేస్తున్నవారు 356 మంది ఉన్నారు.