వెంగళరావునగర్ : పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మానసిక ఒత్తిడితో బీటెక్ చదువుతున్న విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం…బల్కంపేటలోని సాయిబాబానగర్‌లో నివసించే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డి.లక్ష్మణ్‌రావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకూతురు శ్రుతి (19) షాదన్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుంది.
గతంలో జరిగిన పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యింది. దీంతో మానసికంగా కుంగిపోయింది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో మనోవేధనకు లోనై ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు తండ్రి లక్ష్మణ్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.