నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 31 : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియమితులైన అదనపు జిల్లా జడ్జి ఎస్.గోవర్ధన్‌రెడ్డిని న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ జిల్లా జడ్జి సునీత కుంచాల సమక్షంలో పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రంలో జిల్లా న్యాయ సేవా సంస్థకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తామన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ఆకుల రమేశ్, నీలకంఠరావు, పి.రాజేశ్వర్‌రెడ్డి, యెండల ప్రదీప్ జడ్జి గోవర్ధన్‌రెడ్డికి పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.