
జాతీయ రహదారి-167 రక్తమోడింది. గురువారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా అప్పాయిపల్లి స్టేజీ సమీపంలో ఆటోను ఎదురుగా వస్తున్న మారుతి స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ చంద్రశేఖర్‌రెడ్డి (35), దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయ అటెండర్ విజయరాణి (50) అక్కడికక్కడే మృతి చెందారు. జూనియర్ అసిస్టెంట్ జ్యోతి(40) తీవ్రంగా గాయపడగా.. మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఖాజాపాషా, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీలత, మణికొండ వాసి కవిత తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని పాలమూరు, హైదరాబాద్ దవాఖానలకుతరలించారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 9 : కారు, ఆటోను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అప్పాయిపల్లి గేటు ప్రధాన రహదారి (167వ హైవే)పై చోటు చేసుకున్నది. కుటుం బ సభ్యులు కథనం మేరకు.. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని అప్పాయిపల్లి గేటు వద్ద దేవరకద్ర నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న ఆటో (టీఎస్ 06 యూసీ 0127)ను ఎదురుగా వచ్చిన స్విఫ్ట్ (ఏపీ 10 ఏఎస్ 3456) కారు ఢీకొట్టింది. ఆటోలో డ్రైవర్‌తోపాటు మరో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులోని చంద్రశేఖర్‌రెడ్డి (35), దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయరాణి (50) అక్కడికక్కడే మృతి చెందా రు. జూనియర్ అసిస్టెంట్ జ్యోతి(40) తీవ్రంగా గాయపడగా.. మ హబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ ఆమె మరణించింది. అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఖా జాపాషా, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీలత, మణికొండ గ్రామానికి చెం దిన కవిత తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరిని పాలమూరు జనరల్ దవాఖానకు, శ్రీలతను హైదరాబాద్‌లోని యశోద దవాఖాన కు తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులోని వారు వీరం గం సృష్టించారు. వీరిని సముదాయించేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌ను కొట్టేందుకు యత్నించారు. దీంతో అక్కడ ప్రయాణికులు తిరగబడి వారిని చితకబాదారు.
పలువురి పరామర్శ..
ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రె డ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు జిల్లా జనరల్ దవాఖానకు చేరుకున్నారు. మృతుల కు టుంబ సభ్యులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన చికి త్స అందించాలని సూపరింటెండెంట్ రాంకిషన్‌ను ఆదేశించారు. పరామర్శించిన వారిలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, డీపీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో జ్యోతి, టీఎన్జీవోఎస్ నేతలు రాజీవ్‌రెడ్డి, క్రాంతికుమార్‌గౌడ్ ఉన్నారు. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి దవాఖానలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించా రు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతుల కుటుం బ సభ్యులకు న్యాయం చేస్తామని తెలిపారు.