అంబర్పేట : పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆపత్కాలంలో వారికి వైద్యం నిమిత్తం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. శుక్రవారం గోల్నాక డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికి మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వేల సంఖ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగిందన్నారు. తన కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక వ్యక్తిని సీఎం రిలీఫ్ ఫండ్ పనులు చూసేందుకు నియమించడం జరిగిందని పేర్కొన్నారు.