శంషాబాద్ రూరల్ : బిజేవైఎం నాయకులు వ్యాపారిని బెదిరించి డబ్బులు లాక్కున్నసంఘటన శంషాబాద్ మండలంలో కలకలం సృష్టించింది. అందుకు కారణమైన బిజేవైఎం నాయకుడు భానుప్రసాద్, అతని అనుచరులను ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
సీఐ ప్రకాశ్‌రెడ్డి తెలిసిన వివరాల ప్రకారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామానికి చెందిన భానుప్రసాద్, అతడి అనుచరులు శివప్రసాద్, రాజు అనే ముగ్గురు వ్యక్తులు ఆదే గ్రామానికి చెందిన వెంకటరమణ ట్రేడర్స్ యాజమాని నరేందర్ వద్ద పలుమార్లు అప్పుతీసుకొని తిరిగి చెల్లించారు. మరోసారి భానుప్రసాద్ పెద్దమొత్తంలో నరేందర్ వద్ద అప్పుతీసుకొని తిరిగి చెల్లించడం లేదు.
ఈ విషయమై నరేందర్ గట్టిగా నిలదీయడంతో భానుప్రసాద్ తన అనుచరులతో వెళ్లి నరేందర్‌పై దాడి చేయడంతో పాటు కౌంటర్లో ఉన్న 50 వేల నగదును దోచుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేనుకున్న పోలీసులు భానుప్రసాద్‌తో పాటు శివప్రసాద్, రాజును ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ భానుప్రసాద్ ఆదే గ్రామంలో పలువురి వద్ద డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా వారిపై దాడులు చేసి భయపెట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.