సిద్దిపేట, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని, యాసం గి ధాన్యం కొనుగోలు విషయంలో మొండి వైఖరిని అవలంభిస్తున్నదని, ఆ పార్టీ తీరును ఎక్కడికక్కడ ఎండగట్టాలని రైతులు, టీఆర్ఎస్ శ్రేణులకు ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ నుంచి సిద్దిపేట నియెజకవర్గంలోని పార్టీ ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 20న సోమవారం గ్రామగ్రామాన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ర్టాలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదేది తన బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ర్టాలు రైతులు పంటలు పండించడానికి కావాల్సిన కరెంట్, నీళ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తాయని తెలిపారు. కాగా, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇవేవి పట్టించుకోకుండా ఒకే దేశంలో రెండు విధానాల పాలన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని మంత్రి విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయరంట..? పంజాబ్ రాష్ట్రంలోని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తరంట, ఇదెక్కడి న్యాయం అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ వానకాలంలో పండిన ధాన్యాన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 90 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషిచేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, నాణ్యమైన ఉచిత 24గంటల కరెంట్ ఇస్తున్నదన్నారు. కాలంతో పనిలేకుండా కాళేశ్వరం జలాలతో మండుటెండల్లో చెరువుల మత్తళ్లు దుంకించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్నదన్నారు. తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. ధాన్యం సేకరణ పూర్తిగా కేంద్రం బాధ్యత అని, ఇంత వరకు యాసంగి ధాన్యంపై విధివిధానాలను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయడంతో పాటు రాష్ట్ర రాజధానిలో దీక్ష చేపట్టినట్లు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు. ఇంత చేసినా బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నదని , ఈ విషయాన్ని గ్రామాల్లోని రైతులకు వివరించాలని టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి సూచించారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గ్రామగ్రామనా బీజేపీ బండారాన్ని బట్టబయలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
మహాధర్నాకు భారీగా తరలిరావాలి
గజ్వేల్, డిసెంబర్ 18 : రైతులను మోసం చేస్తు న్న కేంద్రప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగట్టడానికి సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ని ర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరి యాదవరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్ సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమాను అందిస్తూ ప్రోత్సహిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రైతులంతా అద్భుతంగా పంటలు పండిస్తున్నారని, తెలంగాణ వ్యవసాయరంగంలో దేశానికి ఆదర్శంగా మారుతున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రైతులను దూరం చేయాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహాధర్నాతో దిమ్మతిరిగేలా చేద్దామన్నారు. అన్ని నియోజకవర్గ, మం డల కేంద్రాల్లో నిర్వహించే మహాధర్నాకు నా యకులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలతో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సి రాజమౌళి, సీనియర్ నాయకులు మాదా సు శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, జడ్పీటీసీలు పంగ మల్లేశం, సుధాకర్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్లు చిన్నమల్లయ్య, రంగారెడ్డి, నాచారం ఆలయకమిటీ చైర్మన్ హన్మంతరావు, రైతుబం ధు సమితి కోఆర్డినేటర్ మద్దిరాజిరెడ్డి, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, రహీం, బబ్బూరి రజిత, ఆయా మండలాఅధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిని పలువురు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.