నిజామాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నీళ్లు, నిధులు, నియామకాలే ట్యాగ్‌లైన్‌గా ఏర్పడిన రాష్ర్టాన్ని దేశం గర్వించదగిన స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో దాదాపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేశారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగాల నియామాకలకు సర్కారు సిద్ధమైంది. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ది. రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అయిన నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల విభజన జరుగుతుంటే అడుగడుగునా అడ్డుకునేందుకు బీజే పీ నేతలు కుట్రలకు దిగుతున్నారు. ప్రజలను రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని నెలకొల్పాలనే దురుద్ధేశంతో బీజేపీ వ్యవహరిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డదారిలో నడుస్తుండగా చట్టప్రకారం అరెస్ట్ అయ్యారు. ఇప్పు డు బండి దారిలోనే ఇందూరు నేతలు కూడా తొండి రాజకీయంతో ప్రజలను మభ్యపెట్టేందు కు సిద్ధమయ్యారు.దీక్షల పేరుతో లీకులు అందించి జనాన్ని ఆగం చేసేందుకు యత్ని స్తుండడం హాస్యాస్పదంగా మారుతున్నది.
కేంద్రం ఆదేశాలు… బీజేపీ బుట్టదాఖలు…
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దేశ వ్యా ప్తంగా ఒమిక్రాన్ రూపంలో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్నది. కేంద్ర సర్కారు వైఫల్యంతో యావత్ దేశం రానున్న కొద్ది రోజుల్లోనే మూడో వేవ్‌తో అల్లాడిపోయే దుస్థితి ఏర్పడిం ది. బీజేపీ ప్రభుత్వం చేతకానితనంతో కోట్లాది మంది ఇబ్బందులకు గురవుతున్న వేళ.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం దిద్దుబాటుకు సిద్ధమైంది. రాష్ర్టాలను అప్రమత్తం చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తూ కొవిడ్-19 మా ర్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తూ జీవోలను సైతం జారీ చేసింది. మాస్కుల వాడకం, భౌతి క దూరం వంటివి తప్పనిసరి చేసింది. కరోనా నుంచి ప్రజలను రక్షించుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం వైరస్ వ్యాప్తికి దోహదం చేసేలా ప్రయత్నిస్తున్నారు. స్వయంగా కేంద్రం ప్రభుత్వమే కరోనా నిబంధన లు పాటించాలంటూ చెబుతుండగా… ఆపార్టీ నేతలు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కిప్రజలను పక్కదారిపట్టిస్తున్నారు.
అటు బండి… ఇటు అర్వింద్…
రాష్ట్రంలో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీల తీరుపై చాలా కాలంగా ప్రజల్లో అసంతృప్తి రగిలి పోతున్నది. ఒకరు కరీంనగర్ ఎంపీ బండి సంజ య్ కాగా… మరొకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రాజకీయాలు చేసే వీరిని సొంత పార్టీ నేతలే తిట్టి పోస్తున్నారు. అయితే… కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న దుస్థితిలో బీజేపీ ఎంపీల తీరు వివాదాస్పదం అవుతున్న ది. ఆదివారం దీక్షకు దిగి బం డి సంజయ్ నవ్వులపాలవ్వగా… కేంద్ర సర్కారు నిబంధనలు తుంగలో తొక్కుతూ మరో ఎంపీ అర్వింద్ సై తం ప్రజల నుంచి తీవ్రస్థాయి విమర్శలను ఎదుర్కొంటున్నారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యా ఖ్యలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యా ప్తంగా పలు కేసులు నమోదు కాగా… ఇప్పుడు ఆయన అనుచరగణం చేసేది లేక నిజామాబాద్ లో అలజడి సృష్టించేందుకు పూనుకున్నది. బం డి బాటలోనే దీక్ష పేరుతో నాటకానికి తెరలేపి ఘర్షణపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చే సేందుకు కుట్రలకు దిగడంపై ఇందూరు ప్రజ లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.