ఖలీల్‌వాడి, డిచ్పల్లి 19: నగరంలోని బోధన్ రోడ్లో ఉన్న గ్రౌండ్లో ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన బిగాల కృష్ణమూర్తి మెమోరియల్ క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. ఇందులో మొత్తం 24 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌తో తలపడిన సూపర్ స్టార్ జట్టు విజేతగా నిలిచి టోర్నీని సొంతం చేసుకోగా, యూనికట్స్ రన్నర్‌గా నిలిచింది. బహుమతుల పంపిణీ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల హాజరై విన్నర్ జట్టుకు రూ. లక్ష, రన్నర్‌కు రూ. 50వేల నగదుతో పాటు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.