
వేల్పూర్, డిసెంబర్ 10: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో తన మిత్రుల సహకారంతో రూ.31 లక్షలతో ఏ ర్పాటు చేసిన ఎనిమిది ఐసీయూ, ఆరు ఆక్సిజన్ బెడ్లను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల మాట్లాడారు. తెలంగాణ రాక ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో కూడా ఐసీయూబెడ్లు లేని పరిస్థితి ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభు త్వం అన్ని దవాఖానలను మెరుగుపరుస్తోందన్నారు. కరోనా మహమ్మారి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టిందని, ఎన్నో పాఠాలను కూడా నేర్పిందని చెప్పారు. కరోనా కట్ట్టడికి కలెక్టర్ నారాయణ రెడ్డి, వైద్య సిబ్బంది ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పనితీరుతో తనకు ఆత్మీయులయ్యారని, వారి పని మీద పూర్తి విశ్వాసం ఏర్పడిందన్నారు. రెండో వేవ్‌లో ఎంతో మంది ఆత్మీయుల్ని కోల్పోయామన్నారు. ఎంత డబ్బు ఉన్నా అత్యవసర సౌకర్యా లు లేక వారిని కాపాడుకోలేక పోయామని ఆవేదన వ్య క్తం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు.
రూ. 1.5 కోట్లతో అధునాతన సౌకర్యాల ఏర్పాటు
తన మిత్రుల సహకారంతో రూ. 1.5 కోట్లతో బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వేముల తెలిపారు. ఆక్సిజన్ బెడ్లు, ఆపరేషన్ థియేటర్, ఆర్వో వాటర్ ప్లాంటు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తన మిత్రులతోపాటు తన సతీమణి నీరజారెడ్డి కూడా రూ.25 లక్షలు దవాఖానల అభివృద్ధి కోసం ఇచ్చారని చెప్పారు. ఇటీవల ఓ మిత్రుడు రూ. 27లక్షల విలువ గల ఆక్సిజన్ అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చాడని, అది మోర్తాడ్ కేంద్రంగా నియోజకవర్గం అంతా వినియోగంలోకి వచ్చిందన్నారు. వేల్పూర్తోపాటు నియోజకవర్గంలోని ఇతర దవాఖానల ఆధునీకరణకు పనిచేసిన వైద్యులు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో మంత్రి సతీమణి నీరజారెడ్డి, ఎంపీపీ బీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్ ఎంపీపీ సురేశ్, సర్పంచ్ తీగల రాధ, ఎంపీటీసీ మొండి మహేశ్, ఉపసర్పంచ్ సత్యం, ఎంపీడీవో కరుణాకర్, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో డాక్టర్ సుదర్శనం, నిజామబాద్ జిల్లా ద వాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రమేశ్, వేల్పూర్ పీహెచ్సీ డాక్టర్ అ శోక్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.