అత్తాపూర్ : ఈ వెల్స్ పేరుతో అత్తాపూర్ పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 129 వద్ద ఏర్పాటు చేసిన ఎలక్టిక్ బైక్ షోరూంను శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ…వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని, రానున్న కాలంలో పెట్రోల్‌తో నడిచే బైక్‌లను కొనలేని పరిస్థితి వస్తుందన్నారు. ఈ క్రమంలో పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండానికి బ్యాటరీ బైక్‌లు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు.
ఈ సందర్బంగా బ్యాటరీతో నడిచే బైక్‌లను పరీశీలించిన ఆయన వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్‌కుమార్, రాజేంద్రనగర్ ఇన్స్‌స్పెక్టర్ కనకయ్య, షోరూం నిర్వాహకులు అరుణ్, శివకార్తీక్, ఈ వెల్స్ కంపెనీ తెలంగాణ ఢీలర్ సుదీర్‌రెడ్డి , సౌత్‌జోన్ చీప్ కోటేశ్వర్రావు, మేనేజర్ శ్రీనివాస్ గుప్తా , జిల్లా పార్టీ టిఆర్ఎస్ నాయకులు సురేందర్‌రెడ్డి, అమరేందర్, జీహెచ్ఎంసీ వార్డుకమిటి సభ్యుడు సురేష్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, హరినాథ్, చిత్తారీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.